అమరావతిలో వరల్డ్ క్లాస్ బిల్డింగ్..
- May 22, 2016
వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలుపెడతారు. అమరావతిని ప్రపంచంలోనే అత్తుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది. అందుకు సీఎం చంద్రబాబు వివిధ రకాల ప్లాన్లు తయారు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు, ఇంటర్నేషనల్ మోడల్స్, నైన్ సిటీస్, ఇలా ఎన్నో ఆలోచనలు. ఇప్పుడు సర్కారు ప్రయత్నానికి మరికొన్ని సంస్థలు కూడా కలసివస్తున్నాయి.
అమరావతి శరవేగంగా డెవలప్ కావాలంటే పెట్టుబడులు రావాలి. అంతర్జాతీయ కంపనీలు అమరావతి వైపు చూడాలి. పెట్టుబడులు పెట్టాలి. తమ గమ్యంగా అమరావతిని ఎంచుకోవాలి. కానీ అసలంటూ ఏమీ లేకుండా పెట్టుబడులు ఎలా వస్తాయి. అందుకే ఓ సంస్థ అమరావతిలో ఓ అత్యధ్భుతమైన బిల్డింగ్ కడతానంటోంది. అది కూడా 240 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో.
అమరావతిలో వరల్డ్ క్లాస్ బిల్డింగ్..
అత్యున్నత ప్రమాణాలు ఉన్న అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించడానికి, వారికి అత్యాదునిక వసతులు కల్పించడానికి ఈ దిగ్గజ భవనాన్ని నిర్మిస్తున్నామని ఆందప్రదేశ్ ప్రవాస తెలుగు సొసైటీ చెబుతోంది. ప్రవాస తెలుగువారికి ఈ సంస్థ ఐక్యవేదికగా ఉపయోగపడే ఈ సొసైటీ అమరావతి అభివృద్ధి కోసం పాటుపడుతుందట. విదేశాల్లో ఎనభైమూడు దేశాలలో 40 లక్షల మంది తెలుగువారు ఉన్నాని ఈ సంస్థ చెబుతోంది.
ఈ ప్రవాసాంధ్రులు తమ సేవలను పొందడానికి వీలుగా తమ సొసైటీతో రిజిస్టర్ చేసుకోవాలని ప్రవాస తెలుగు సొసైటీ చెబుతోంది. ప్రవాసాంధ్రులు తమ వివరాలను www. apnrt.com లో రిజిస్టర్ చేసుకోవాలట. ప్రవాస తెలుగువారికి తిరుమల దర్శనం, పాన్ కార్డు తదితర పదిహేను సదుపాయాలతో పాటు,వారి తల్లిదండ్రులకు తోడ్పాటు, ప్రయాణ ఏర్పాట్లు వంటి సేవలను కూడ అందిస్తారట
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







