భారత కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ శివన్

- October 11, 2023 , by Maagulf
భారత కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ శివన్

దుబాయ్: దుబాయ్‌లోని కొత్త కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా సతీష్ కుమార్ శివన్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు భారత కాన్సులేట్ ప్లాట్‌ఫామ్ X(గతంలో ట్విటర్)లో ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త కాన్సుల్ జనరల్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. శివన్ 2005-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. న్యూ ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)తో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే విదేశాంగ మంత్రికి డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు.  అంతకుముందు, శివన్ దక్షిణ కొరియాలోని సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా, అమెరికా వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి మొదటి కార్యదర్శిగా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com