సౌదీ ఆర్థిక వ్యవస్థ 2024లో 4% వృద్ధి.. IMF అంచనా
- October 12, 2023
రియాద్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2024లో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ (స్థూల దేశీయోత్పత్తి -GDP) వృద్ధి కోసం తన అంచనాలను నాలుగు శాతానికి పెంచింది. మంగళవారం విడుదల చేసిన తాజా వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ నివేదికలో, 2023లో సౌదీ ఆర్థిక వృద్ధి అంచనాను 1.1 శాతం నుంచి 0.8 శాతానికి IMF తగ్గించింది. ఫండ్ యొక్క తాజా అంచనాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2022లో 3.5 శాతం నుండి ఈ సంవత్సరం 3 శాతానికి, వచ్చే ఏడాది 2.9 శాతానికి మందగిస్తుంది. జూలైలో విడుదల చేసిన దాని మునుపటి అంచనా ప్రకారం.. 2024కి 0.1 శాతం పాయింట్ డౌన్‌గ్రేడ్ ఉంది. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, అంతర్జాతీయ వస్తువుల ధరల క్షీణత కారణంగా 2022లో 8.7 శాతం ఉన్న ప్రపంచ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 6.9 శాతానికి, ఆపై 2024లో 5.8 శాతానికి తగ్గుతుందని IMF సూచించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







