బిగ్‌బాస్ 2.0.! కొత్తగా ఆలోచించాడు కానీ.!
- October 12, 2023
బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ‘ఉల్టా ఫుల్టా’ కాన్సెప్ట్ ఒకింత జోరుగానే సాగుతోందని చెప్పొచ్చేమో. 14 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ షో నుంచి ఐదు వారాల్లో ఐదుగురిని ఎలిమినేట్ చేసేశాడు. దాంతో, బిగ్‌బాస్ ఇక చూడడం వేస్ట్ అనుకున్నారు వీక్షకులు.
ఆ లోపే బిగ్‌బాస్ 2.0 అంటూ మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను లోపలికి పంపించి షాకిచ్చాడు హోస్ట్ నాగార్జున. ఆల్రెడీ హౌస్‌లో వున్నవాళ్లని ఆటగాళ్లుగా.. కొత్తగా లోపలికి వెళ్లిన వాళ్లని పోటుగాళ్లుగా విభజించి టాస్కులు కండెక్ట్ చేస్తున్నాడు బిగ్‌బాస్.
ఓకే.! 2.0 ఒకింత ఆసక్తికరంగానే సాగుతోంది. అయితే, టాస్కుల్లో ఇంకాస్త పస పెంచితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అన్నట్లు ఆల్రెడీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన గౌతమ్‌ని ఎలిమినేట్ చేసినట్లే చేసి, సీక్రెట్ రూమ్‌లో వుంచి రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి పంపించి పోటుగాళ్ల టీమ్‌తో చేర్చాడు.
గౌతమ్ 2.0 తనదైన ఆటతో పవర్ ప్రదర్శిస్తున్నాడు. అలాగే, పోటుగాళ్ల రాకతో ఒకింత హౌస్‌లోనూ అలజడి రేకెత్తడంతో పాటూ, వీక్షకులకి కావల్సిన కంటెంట్ అయితే అందుతోందన్న అభిప్రాయాలున్నాయ్. అయితే, ‘2.0’ అన్నాకా.. ఇది మాత్రమే చాలదు ఇంకా కొంచెం కావాలి. లెట్స్ థింక్ వన్స్ బిగ్‌బాస్.!
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







