యాంగ్రీ మేన్ రాజశేఖర్ గెస్ట్ రోల్ ఫర్ నితిన్.!

- October 12, 2023 , by Maagulf
యాంగ్రీ మేన్ రాజశేఖర్ గెస్ట్ రోల్ ఫర్ నితిన్.!

సీనియర్ నటుడు యాంగ్రీ మేన్ రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అదే జోరులో ‘కల్కి’తోనూ హిట్టు కొట్టారు.

తాజాగా ఆయన తన ఆలోచనా విధానం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ హీరో రోల్స్ కాకుండా, విభిన్నమైన పాత్రల్లో సత్తా చాటాలనుకుంటున్నట్టున్నారు. మొన్నా మధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ రోల్ పోషిస్తారట.. అనే ప్రచారం జరిగింది. అది జరగలేదు కానీ, నితిన్ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

నితిన్, వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నితిన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడీ సినిమాలో.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో రాజశేఖర్ నటిస్తున్నాడట. ఇంతవరకూ హీరోగా మాత్రమే చూసిన ఆయనను ఈ సినిమాలో ఓ కొత్త గెటప్‌తో సర్‌ప్రై‌జింగ్ రోల్‌లో చూడబోతున్నామనీ తెలుస్తోంది. బహుశా అది నెగిటివ్ షేడ్స్ వున్న రోల్ అయినా కావచ్చు.

చూడాలి మరి, ఈ సరికొత్త అవతార్‌లో రాజశేఖర్‌ని ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో. అన్నట్లు నెగిటివ్ రోల్స్ రాజశేఖర్‌కి కొత్తేం కాదండోయ్. గతంలో ఆ తరహా రోల్స్‌లో ఆయనను చూసిన అనుభవం ప్రేక్షకులకి వుండనే వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com