కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
- October 12, 2023
ఉత్తరాఖండ్: ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్12,2023) ప్రధాని పిథోరాఘడ్ జిల్లాలోని ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులతో తలపాగా ధరించిన ప్రధాని మోదీ పార్వతి కుండ్‌లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ తనదైన శైలిలో స్థానికులను కలిశారు. జగేశ్వర్ ధామ్, సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించారు. స్థానికులతో ముచ్చటించారు. మహిళలతో ఆప్యాయంగా మాట్లాడారు. వారు నమస్కారం చేస్తుంటే మోదీ కూడా నవ్వుతు వారి చేతులు పట్టుకుని మాట్లాడారు. శిరస్సు వంచి నమస్కరించారు మోదీ. ఓ మహిళ మోదీ తలను ఆప్యాయంగా నిమిరారు. అక్కడే ఓ చిన్నారి మోదీ వద్దకు రాగా బాలుడికి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బాబు బుగ్గలు నిమిరి వాత్సల్యాన్ని చూపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







