‘భగవంత్ కేసరి’ లో కాజల్ క్యారెక్టర్ ఎలా వుండబోతోందంటే
- October 12, 2023
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, బాలయ్యతో జోడీ కడుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
కాగా, ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ పాత్రను లేపేశారంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. కానీ, సినిమా ప్రమోషన్లలో కాజల్ అగర్వాల్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది.
ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇంటర్వ్యూల్లో తన క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా వివరించి చెబుతోంది. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుండబోతోందనీ, మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందర్నీ అలరిస్తుందని కాజల్ చెబుతోంది.
ముఖ్యంగా తన పాత్ర చాలా హ్యూమరస్‌గా వుండబోతోందని కాజల్ చెప్పింది. ఇంతవరకూ ఈ తరహా హ్యూమరస్ పాత్రల్లో తాను కనిపించలేదనీ, అనిల్ రావిపూడి తన పాత్రను చాలా బాగా డిజైన్ చేశాడనీ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. అని కాజల్ చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







