మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న యుద్ధం..
- October 12, 2023
ఇజ్రాయెల్-గాజా యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హమాస్ కు మద్దతు ఇస్తున్నందుకు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.
డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై దాడులు జరిగాయి. దీంతో ఆ విమానాశ్రయాలను అధికారులు మూసేశారు. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో డమాస్కస్, అలెప్పోలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం జరిగిందా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఆ రెండు విమానాశ్రయాలపై వ్యూహాత్మకంగా ఒకే సమయంలో ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది.
ఇజ్రాయెల్ సైన్యం-హమాస్ మధ్య ఆరో రోజు యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై దాడులు జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇవాళ ఇజ్రాయెల్ లో పర్యటించారు. తమ దేశం ఇజ్రాయెల్ కు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తోందని, అయితే, ప్రజలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







