దుబాయ్-భారత్ మధ్య నీటి అడుగున రైలుమార్గం!
- October 13, 2023
దుబాయ్: దుబాయ్ నుండి భారతదేశంలోని ముంబై నగరం వరకు నీటి అడుగున రైలు మార్గం నిర్మించే యోచనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఉంది. ఈ రైలు మార్గం 1,200మైళ్లు (2,000 కి.మీ) దూరం ఉంటుందని అంచనా. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తోపాటు నీరు, చమురుతో సహా వివిద రకాల వస్తువులను రవాణా చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. వాస్తవానికి దుబాయ్ నుండి ముంబైకి నీటి అడుగున రైలు ప్రాజెక్ట్ ను మొదట 2018లో ప్రస్తావించారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేషనల్ అడ్వైజర్ బ్యూరో రైల్వే రైలు మార్గానికి సంబంధించిన బ్లూప్రింట్‌పై పని చేస్తోంది. ప్రస్తుతం యూకే నుండి ఫ్రాన్స్‌ను కలిపే ఛానల్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నీటి అడుగున రైల్వే సొరంగంగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









