Devi Navratri 2023: దుర్గా మాతను 9 రోజుల పాటు ఎలా పూజిస్తారంటే?

- October 13, 2023 , by Maagulf
Devi Navratri 2023: దుర్గా మాతను 9 రోజుల పాటు ఎలా పూజిస్తారంటే?

Devi Navratri 2023 : హిందూ మతంలో దేవి నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీన ముగియనున్నాయి. 24వ తేదీన విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటారు. నవరాత్రుల సమయంలో దుర్గా మాత భూలోకానికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. అందుకే నవరాత్రుల వేళ దుర్గా మాత విగ్రహాలను ప్రతిష్టించి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఉపవాస దీక్షలను పాటించి ఆరాధిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 రోజుల పాటు ఏయే రూపంలో అలంకరించి పూజిస్తారు.. పూజల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈసారి దేవీ నవరాత్రులు అక్టోబర్ 14వ తేదీ రాత్రి 11:24 గంటలకు పాడ్యమి తిథి నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 15వ తేదీ 12:24 గంటలకు తిథి ముగియనుంది.  ఉత్తర భారతంలో నవరాత్రుల్లో మొదటి రోజున శైల పుత్రి దేవి, విధియ రోజు బ్రహ్మచారిణి, తదియ రోజు చంద్రఘంట పూజ, చతుర్ధి రోజు కూష్మాండ అవతారంలో, పంచమి రోజున స్కంద మాత, షష్ఠి తిథి నాడు కాత్యాయని దేవిగా, సప్తమి తిథి వేళ కాళరాత్రి అమ్మవారి పూజ, అష్టమి నాడు మహా గౌరి పూజ, దుర్గాష్టమి, నవమి రోజున సిద్ధిదాత్రి పూజ, దుర్గా మహా నవమి పూజను నిర్వహిస్తారు.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి అలంకారాలను పరిశీలిస్తే...

 

15 అక్టోబర్ 2023 : మొదటి రోజున బాల త్రిపుర సుందరీ

16 అక్టోబర్ 2023 : రెండో రోజున గాయత్రీ దేవి

17 అక్టోబర్ 2023 : మూడో రోజున అన్నపూర్ణా దేవి

18 అక్టోబర్ 2023 : నాలుగో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి

19 అక్టోబర్ 2023 : ఐదో రోజున శ్రీ మహా చండీ దేవి

20 అక్టోబర్ 2023 : ఆరో రోజున శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)

21 అక్టోబర్ 2023 : ఏడో రోజున లలితా త్రిపుర సుందరీ దేవి

22 అక్టోబర్ 2023 : ఎనిమిది రోజున దుర్గా దేవి అలంకారం

23 అక్టోబర్ 2022 : తొమ్మిదో రోజు సోమవారం రోజున మహిషాసుర మర్దినీ దేవి, రాజ రాజేశ్వరి దేవి రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అనంతరం క్రిష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com