నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదు కానున్న స్పైస్‌జెట్‌

- May 22, 2016 , by Maagulf
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదు కానున్న స్పైస్‌జెట్‌

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ బీఎస్‌లోనే నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌ జరగని అతికొద్ది కంపెనీల్లో స్పైస్‌ జెట్‌ ఒకటి. చాలా వరకు పెద్ద సంస్థలు రెండు చోట్ల నమోదైయ్యాయి. 'మేము మా సంస్థ షేర్లను ఎన్‌ఎస్‌ఈలో కూడా నమోదు చేయించాలనుకుంటున్నాం.. ఈ చర్యతో కంపెనీ షేర్లు పరిధి పెరుగుతుంది.. దీనికి తోడు సంస్థపై విశ్వాసం కూడా బలపడుతుంది'' అని సంస్థ ఎండీ అజయ్‌ సింగ్‌ అన్నారు. స్పైస్‌ జెట్‌ వరుసగా ఐదు త్రైమాసికాల నుంచి లాభాలు నమోదు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com