ఇకపై బ్యాంకు సేవలు పోస్టాఫీసుల్లో
- May 22, 2016
వచ్చే ఏడాది మార్చి నుంచి పోస్టాఫీసుల్లో పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు కేంద్ర, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో 25,939 పోస్టాపీసులున్నాయన్న ఆయన ...దేశ ఆర్థిక అభివృద్ధిలో వీటిని వినియోగించుకుంటున్నామన్నారు. ఇప్పటికే 50 స్వదేశీ సంస్థలు పోస్టుల్ పేమెంట్ బ్యాంకులతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చాయన్నారు. ఇందులో ప్రపంచ బ్యాంకుతో పాటు జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంకు, యూకేకు చెందిన బాక్లేస్, అమెరికాకు చెందిన సిటీ బ్యాంకులు ఉన్నాయన్నారు. ఇవాళ కేంద్రమంత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో దేశంలోని ఆయా పోస్టల్ సర్కిల్ అధికారులతో సమావేశమయ్యారు.
పోస్టల్ రంగంలో డిజిటల్ విధానాలు, సాంకేతిక వినియోగం, మానవ వనరుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ కామర్స్‌లోనూ పోస్టల్ డిపార్ట్మెంట్ 81 శాతం వ్యాపారం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉత్పత్తుల్లోనూ మన దేశం 8లక్షల కోట్ల ఆదాయం సాధించిందన్నారు. ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో లక్షా 21వేల కోట్ల పెట్టుబడులు గత రెండేళ్లలో వచ్చాయని వివరించారు. మన దేశంలోనే 11 కోట్ల మొబైల్ ఫోన్లు గతేడాది తయారయ్యాయన్నారు. జనవరి 2017 నాటికి అన్ని ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







