పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌గా కిరణ్‌ బేదీ

- May 22, 2016 , by Maagulf
పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌గా కిరణ్‌ బేదీ

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌గా తనను నియమించడంపై ఐపీఎస్‌ మాజీ అధికారిణి కిరణ్‌ బేదీ ఆనందం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్‌ బేదీని పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కిరణ్‌ బేదీ మాట్లాడుతూ.. ప్రజల బాధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడమే జీవన పరమార్థమన్నారు. ప్రభుత్వానికి పనిచేయడం త్యాగంతో కూడిన సేవన్నారు. ప్రభుత్వ సేవ చేయడం తనకు ఇష్టమని, అందులో చాలా ఆనందం లభిస్తుందన్నారు. సేవచేసే ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవిని తాను అధికారంగా కాకుండా సేవగా భావిస్తానన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఉంచిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com