యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్..
- October 14, 2023
న్యూ ఢిల్లీ: ఎయిరిండియా యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఐదు యూరోపియన్ నగరాలకు భారీ తగ్గింపు ధరలతో విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. ఇక ఎయిర్ ఇండియా చాలా చౌకగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించిన ఆ ఐదు నగరాల జాబితాలో లండన్, కోపెన్హాగన్, మిలన్, పారిస్, వియన్నా ఉన్నాయి. కాగా, ఈ విమాన సర్వీసులలో ప్రారంభ ధరలు వచ్చేసి వన్-వేకి రూ.25వేలు, రౌండ్ ట్రిప్‌కు రూ.40వేలుగా ఉంటాయని ఎయిరిండియా యాజమాన్యం తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ధరలతో విక్రయించే టికెట్లు ఒక పరిమిత కాలానికి మాత్రమే. కనుక మీకు ఆ ఐదు యూరోపియన్ నగరాలను చుట్టేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ ఐదు నగరాలకు వెళ్లే విమాన సర్వీసులు కేవలం ఎకానమీ క్లాస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు 'వన్-వే' లేదా 'రౌండ్ ట్రిప్' కోసం టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఢిల్లీ, ముంబై నుంచి ఈ ఐదు నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడపనుంది. ప్రతివారం 48 నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ఉంటాయి. కాగా, ఈ 'లిమిటెడ్-టైమ్ సేల్' కింద అందించే విమాన టికెట్ల ధరలు మీరు బయలుదేరే నగరం, వర్తించే మారకపు రేట్లు, పన్నుల ఆధారంగా కొద్దిగా మారవచ్చు. ఈ ప్రత్యేక సేల్ కోసం బుకింగ్‌లు ఈ నెల 14వ తేదీ వరకు ఓపెన్ అయి ఉంటాయి. అలాగే ఈ సేల్ కింద అందించే ప్రత్యేక డిస్కౌంట్ టికెట్లతో ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు ప్రయాణాలు చేయవచ్చు. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ http://www.airindia.com లేదా మొబైల్ యాప్‌లు లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా విమాన టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







