ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులతో సహా 9 మంది బందీలు మృతి
- October 15, 2023
యూఏఈ: గత 24 గంటల్లో గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా నలుగురు విదేశీయులతో సహా తొమ్మిది మంది బందీలు మరణించారని హమాస్ సాయుధ విభాగం శనివారం తెలిపింది. అల్ కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ మేరకు ప్రకటించింది. బందీల మరణాలను హమాస్ ప్రకటించడం ఇది రెండోసారి. విదేశీయులతో సహా 13 మంది బందీలు కూడా దాడుల్లో మరణించారని శుక్రవారం తెలిపింది. 120 మందికి పైగా పౌరులు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గతంలో వెల్లడించింది. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శనివారం నాటికి 3,500 పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







