పాలస్తీనా ప్రజలకు $2 మిలియన్ల సహాయాన్ని అందించిన సౌదీ అరేబియా
- October 16, 2023
రియాద్: పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నియర్ ఈస్ట్‌లోని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)కి సౌదీ అరేబియా $2 మిలియన్ల విలువైన చెక్కును అందించింది. ఏజెన్సీ షెడ్యూల్డ్ వార్షిక సహకారం కోసం చెక్‌ను జోర్డాన్‌లోని సౌదీ అరేబియా రాయబారి నయీఫ్ బిన్ బందర్ అల్-సుదైరి UNRWA కమిషనర్-జనరల్ ఫిలిప్ లాజారినీకి అందజేశారు. పాలస్తీనా ప్రజలకు ఆహారం, ఔషధం మరియు మానవతా అవసరాలను అందించడంతో పాటు, UNRWA తన సహాయ సేవలను అందించడాన్ని కొనసాగించడానికి ఇది దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు UNRWA చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని యూఎన్ లోని సభ్య దేశాలు, అంతర్జాతీయ సమాజానికి ఫిలిప్ లాజారినీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







