బిగ్‌బాస్‌కి వాళ్లంటే నచ్చడం లేదా.?
- October 16, 2023
బిగ్‌బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్తో పాటూ, గ్లామర్ కూడా. అయితే, ఈ సారి బిగ్ బాస్ షోలో ఎంటర్టైన్మెంట్ సంగతి అటుంచితే, బొత్తిగా బిగ్‌బాస్ కి ఆడ వాసన పడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
ఎందుకంటే, ఈ సారి కంటెస్టెంట్స్‌లో గ్లామర్ చాలా తక్కువగా కనిపిస్తోంది. అంటే లేడీ కంటెస్టెంట్లు తగ్గించేస్తున్నారు.
ఎలిమినేషన్లో భాగంగా కేవలం అమ్మాయిల్ని మాత్రమే బయటికి పంపించేస్తున్నారు. తొలి ఎలిమినేషన్లో భాగంగా కిరణ్ రాధోడ్నీ, ఆ తర్వాత షకీలాని ఎలిమినేట్ చేశారు. సర్లే సీనియర్లు కదా.. అనుకుంటే, ఆ తర్వాత నుంచీ కూడా అదే పని చేస్తున్నాడు బిగ్‌బాస్.
కేవలం లేడీ కంటెస్టెంట్లను మాత్రమే వరుసగా పంపించేస్తున్నాడు. మంచి స్టఫ్ ఇవ్వదగ్గ గ్లామర్ బ్యూటీస్‌ని సైతం ఎలిమినేట్ చేయడంపై బిగ్‌బాస్‌పై విమర్శలు వస్తున్నాయ్.
లేటెస్ట్గా ఉల్టా ఫుల్టాలో భాగంగా బిగ్‌బాస్ 2.0 అంటూ మళ్లీ ముగ్గురమ్మాయిల్ని లోపలికి పంపించాడు. నలుగురు అబ్బాయిల్ని కూడా.
ఒకింత గ్లామర్ యాడ్ అయ్యిందిలే అనుకునే లోపు మళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్‌ని బయటికి తోసేశాడు. లేటెస్ట్గా హౌస్‌లోకి వెళ్లిన నయనీ పావని ఎలిమినేట్ చేసేశాడు. అసలేం జరుగుతోంది బిగ్‌బాస్‌లో. మరీ ఇంత బోర్ కొట్టించేస్తున్నాడెందుకు.? అని వీక్షకులు ఫీలవుతున్నారు. ఇంతవరకూ ఒక్క మేల్ కంటెస్టెంట్ కూడా హౌస్ నుంచి బయటకి వెళ్లకపోవడం ఆశ్చర్యం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







