జూనియర్‌తో జత కట్టబోతున్న రాశీఖన్నా
- October 16, 2023
అందాల రాశీ ఖన్నా స్టార్ హీరోయినే. ఎన్టీయార్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ, ఇప్పుడు రాశీఖన్నా కెరీర్ ఏమంత బాగా లేదు. తెలుగులో ప్రస్తుతం రాశీఖన్నాకి పెద్దగా అవకాశాలేం లేవు.
అయితే, తాజాగా ఓ జూనియర్ హీరో సినిమాలో రాశీఖన్నా నటిస్తోందట. ఆయన మరెవరో కాదు, సిద్దు జొన్నలగడ్డ. ‘డీజె టిల్లు’తో అబ్బో ఈయన తెగ పాపులర్. త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’తో రాబోతున్నాడు.
అంతే కాదు, సిద్దు జొన్నలగడ్డ ఖాతాలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులే వున్నాయ్. అందులో తాజాగా ఇంకో ప్రాజెక్ట్ కూడా యాడ్ అయ్యింది. కోన వెంకట్ సోదరి స్టైలిస్ట్ అయిన నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోన్న సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







