దుబాయ్-ఇండియా విమానం కరాచీకి మళ్లింపు
- October 16, 2023
యూఏఈ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుండి అమృత్‌సర్‌కు వెళుతుండగా అకస్మాత్తుగా ఏర్పడిన వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. ఒక ప్రయాణికుడికి తక్షణ వైద్య సహాయం అందించడానికి పాకిస్తాన్‌లోని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరు 14 నాడు దుబాయ్ నుండి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:51 గంటలకు అమృత్‌సర్‌కు వెళ్లే మార్గంలో విమానం టేకాఫ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగింది. విమానం మధ్యలో ఒక ప్రయాణీకుడు తీవ్రమైన వైద్య సమస్యను ఎదుర్కొన్నాడు, ప్రయాణీకుల ఆరోగ్యాన్ని కాపాడటానికి విమానాన్ని కరాచీకి మళ్లించినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని, విమానయాన సంస్థ, విమానాశ్రయ సిబ్బంది మరియు స్థానిక అధికారుల సమన్వయంతో ప్రయాణీకుడికి వైద్య సంరక్షణను అందించారు. వైద్య పరీక్షల తర్వాత ప్రయాణీకుడు ప్రయాణాన్ని కొనసాగించినట్లు ప్రకటించారు. స్థానిక సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు కరాచీ నుండి అసలు గమ్యస్థానమైన అమృత్‌సర్‌కు బయలుదేరిందని ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







