ఇరాన్‌లో వరుస భూకంపాలు.. వణికిన యూఏఈ వాసులు
- October 17, 2023
యూఏఈ: మంగళవారం ఉదయం ఇరాన్ యొక్క దక్షిణ భాగంలో సంభవించిన జంట భూకంపాల నేపథ్యంలో భూప్రకంపనలను అనుభవించినట్లు యూఏఈ నివాసితులు పలువురు తెలిపారు. యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 8.59 గంటలకు దక్షిణ ఇరాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సిఎం) తెలిపింది. ఉదయం 9.10 గంటలకు రెండోసారి భూకంపం వచ్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కొంతమంది యూఏఈ నివాసితులు ప్రకంపనలను అనుభవించినట్లు సోషల్ మీడియాలో నివేదించారు. ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి "దుబాయ్‌లో ఎవరైనా భూకంపం వచ్చినట్లు అనిపించిందా?" భూకంపాల గురించి నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూఏఈలోని భూకంప శాస్త్ర నిపుణులు ఇంతకు ముందు చెప్పారు.’’ అని పేర్కొన్నారు. యూఏఈ తక్కువ నుండి మోస్తరు భూకంపాలను కలిగి ఉందని, అందువల్ల తాము సురక్షితంగా ఉన్నామని, తాము యాక్టివ్ భూకంప బెల్ట్‌లో లేమని NCM సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు.మరోవైపు భూకంపం 10 కి.మీ (6.21 మైళ్లు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) తెలిపింది. భూకంపం ఉత్తర హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో సంభవించిందని పేర్కొంది. భూకంపం బందర్ అబ్బాస్‌కు ఉత్తరాన 61 కిమీ (38 మైళ్ళు) దూరంలో ఉందని, ప్రాణనష్టం గురించి ప్రాథమిక నివేదికలు లేవని తెలిపింది. అయితే, భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







