ఒమానీ మహిళా దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన ది హానరబుల్ లేడీ
- October 17, 2023
మస్కట్: ప్రతి సంవత్సరం అక్టోబరు 17న వచ్చే ఒమానీ మహిళా దినోత్సవం సందర్భంగా సుల్తాన్ జీవిత భాగస్వామి, హానరబుల్ లేడీ అస్సాయిదా అహ్ద్ అబ్దుల్లా హమెద్ అల్ బుసాయిదీ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ అక్టోబర్ 17న ఒమానీ మహిళలు దృఢ సంకల్పం, అవిశ్రాంత ప్రయత్నానికి ప్రశంసలను తెలియజేయడం మాకు ఆనందంగా ఉంది. కుటుంబం మరియు సమాజాన్ని నిర్మించడంలో మన ప్రియమైన మాతృభూమిని పెంచడంలో వారిది ప్రముఖ పాత్ర. ఒమానీ మహిళలు అన్ని రంగాలలో మరియు అన్ని స్థాయిలలో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రశంసనీయమైన సహకారాన్ని అందిస్తున్నారు. ఒమన్‌ను నిర్మించడంలో వారిది ముఖ్యమైన భాగస్వామ్యం. అందరికీ ఒమానీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు." అని తన సందేశంలో ది హానరబుల్ లేడీ, స్పౌజ్ ఆఫ్ హిస్ మెజెస్టి ది సుల్తాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







