దుబాయ్: తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 17, 2023
దుబాయ్: తెలుగు అసోసియేషన్-యూఏఈ వారు బతుకమ్మ సంబరాలను అక్టోబర్ 15వ తేది న దుబాయ్ లోని "షబాబ్ అల్ అహ్లి దుబాయ్ క్లబ్" నందు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తూ, అందమైన పూలతో సుందరంగా బతుకమ్మలను సిద్దం చేసుకుని, సంప్రదాయ వస్త్రధారణలతో విచ్చేసిన తెలుగు ఆడపడచులతో, వారి కుటుంబసభ్యులతో సంబరాలు నిర్వహించిన ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తెలంగాణ సామాజిక సేవా విభాగ డైరెక్టర్ వుట్నూరి రవి మరియు ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుస ప్రధాన నాయకత్య భాద్యతలు నిర్వహించారు.
తెలుగు అసోసియేషన్ వైస్ చైర్మన్ మసిఉద్దీన్ స్వాగతోపన్యాసముతో లాంచనముగా బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తూ, తెలుగు అస్సోసిఏషన్ కొరకు శాశ్వత కార్యాలము ఏర్పాటు చేసుకోవలసిన ఆవశ్యకత, ఆ దిశలో చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. తన్మయి ఆర్ట్ స్టూడియో వారి శిష్య బృదం ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యములతో బతుకమ్మ సంబరాలకు శోభాయమానముగా శుభారంభము జరిగింది.
యూఏఈలో మొట్టమొదటి సారిగా 9 అడుగుల భారీ బతుకమ్మను తెలుగు అసోసియేషన్ వారు ఎంతో అందముగా అలంకరించి, సంబరాలకు కేంద్ర బిందువుగా నిర్వహించటముతో పాటుగా,, యూఏఈలో బతుకమ్మ సంబరాలను తారాస్థాయిలో అత్యంత ఘనంగా ప్రారంభించారు. వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధుమిత్రులతో, కార్యక్రమ నిర్వాహకులతో కలిసి ఈ మధుర క్షణాలను తమ తమ కెమేరాలలో చిత్రీకరించి, మధుర ఙ్ఞాపకాల జాబితాలలో పదిలపరుచుకున్నారు.
ప్రముఖ తెలంగాణ జానపద గాయకి కుమారి మధు ప్రియ, గాయకుడు అష్ట గంగాధర్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినారు. వారిరువురు ఆలపించిన జాన పద గీతాలు, బతుకమ్మ నేపధ్య గీతాలు ప్రతి ఆడ పడచుని, ప్రతి ఒక్క చిన్నారిని రెండు గంటలకు పైగా బతుకమ్మ ఆటాడించేలా ఉత్సాహంతో ఉర్రూతలూగించాయి. కుమారి స్రవంతి,మల్లేష్ కార్యక్రమానికి సంధాన కర్తలుగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు.
60 కి పైగా బతుకమ్మలతో, 1300 మందికి పైగా విచ్చేసిన తెలుగు వారితో సంబరాలు తెలంగాణ వాతావరణాన్ని, బతుకమ్మ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్రతిబింబించింది.
విచ్చేసిన బతుకమ్మ లన్నిటిలో అత్యంత సుందరముగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు, సాంప్రదాయ వస్త్రధారణలో అత్యంత ఆకర్షణీయముగా అలంకరించుకున్న ఆడపడచులకు, ఇంకా మరెన్నో విభాగాలలో పాల్గొని అందరినీ అలరించిన ఆహూతులను ఎంపిక చేసి, విజేతలందరికీ కార్యక్రమ స్పాన్సర్ల చేతుల మీదుగా బహుమతుల ప్రదానము జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఆరియల్ కల్సల్టింగ్ వారు ప్రధాన సమర్పకులుగా, ట్రాన్స్ ఏషియా వారు ప్లాటినం సమర్పకులుగా, ఎస్ ఆర్ ఆర్ బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్ వారు గోల్డ్ సమర్పకులుగా, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారు గోల్డ్ సమర్పకులుగా వ్యవహరించి తమ పూర్తి సహకారమందిచారు. లులు ఎక్చేంజ్, మహన్వి డాక్యుమెంట్స్ క్లియరింగ్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, సాయి, మై దుబాయి, ఎస్ క్యూబ్ కౌంటీ, అల్టాఫీక్ ట్రావెల్, స్ఫియర్ టెక్నాలజీస్, తన్మయ్ ఆర్ట్ స్టూడియో, జువెల్, మాగ్నం క్లినిక్, కెలైడోస్కోప్ ప్రాపర్టీస్, ద లెమన్ స్టూడియో వారు సమర్పకులుగా వ్యవహరించి కార్యక్రమం విజయ వంతముగా నిర్వహించటానికి సహకరించారు.
టీవీ 9 వారు కార్యక్రమానికి లైవ్ కవరేజ్ ఇచ్చి ప్రధాన మీడియా సమర్పకులుగా ఎనలేని సహకారమందించారు. రేడియో ఖుషీ, మా గల్ఫ్, టీవీ 5 వారు మీడియా సమర్పకులుగా పూర్తి సహకారమందించారు.
తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుస గారు, కల్చరల్ డైరెక్టర్ వెంకట సురేష్, ఫైనాన్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ నూకల, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ సాయి ప్రకాష్ సుంకు, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, వెల్ఫేర్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీనివాస్ యెండూరి కార్యక్రమానికి విచ్చేశారు.
తెలుగు అస్సోసిఏషన్ వర్కింగ్ కమిటీ నుంచి లత, సౌజన్య, విమల, ఉష, విజయ్ భాస్కర్, భీం శంకర్, ఫహీం, శరత్ చంద్ర, చైతన్య, శివ, మోహన కృష్ణ కార్యక్రమము విజయవంతము కావించటములో కీలక సహాయ సహకారములందించారు.





తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







