రాష్టపతి చేతుల మీదుగా.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్..
- October 17, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కింద అల్లు అర్జున్ కు ఓ జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ చప్పట్లతో మార్మోగిపోయింది.
అంతకుముందు, అల్లు అర్జున్ ను అవార్డుల కార్యక్రమం వద్ద జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ అవార్డు అందుకోనుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. పుష్ప ఓ కమర్షియల్ చిత్రం అని, అలాంటి చిత్రానికి జాతీయ అవార్డు అంటే నిజంగా డబుల్ అచీవ్ మెంట్ అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. ఇదంతా ఆంగ్లంలో వివరించిన అల్లు అర్జున్ చివర్లో ఏమన్నారంటే… “ఈ ఒక్క మాట మాత్రం నా మాతృ భాషలో చెబితేనే నాకు బాగుంటుంది” అంటూ “తగ్గేదే లే” అనే డైలాగ్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







