21న టెస్ట్ వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్న ఇస్రో
- October 18, 2023
న్యూఢిల్లీ: గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన తొలి పరీక్ష చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో అక్టోబర్ 21న ఉదయం 8.00 గంటలకు టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలిచిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ఇస్రో సూచించింది.
వ్యోమగాముల అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో గగన్‌యాన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యుల్, రాకెట్‌పై తొలి పరీక్షను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో టీవీ-డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్‌ను సిద్ధం చేసింది. దీని సాయంతో క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రియాశీలకమై క్రూ మాడ్యుల్‌ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఈ క్రమంలో క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది. నావికాదళం సాయంతో ఇస్రో క్రూ మాడ్యుల్‌ను స్వాధీనంలోకి తీసుకుని అందులోని డేటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును విశ్లేషిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







