హిందీ 'వీరప్పన్' సినిమా ఈ నెల 27న విడుదల..
- May 22, 2016
ఈ నెల 27న విడుదల కానున్న హిందీ 'వీరప్పన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్తగా చేస్తున్నారు. ముంబయి నగరంలోని కొన్ని సిటీ బస్సులను అద్దెకు తీసుకున్న వర్మ వాటికి బ్లాక్ పెయింట్ వేయించి, వాటిపై 'వీరప్పన్ సినిమా మే 27న రిలీజ్', 'హీ కిల్డ్ 97 పోలీసుమెన్' అని సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ చిత్ర ప్రమోషన్ చేస్తున్న రాంగోపాల్ వర్మకు అభినందనలు అందుతున్నాయి.ఈ సందర్భంగా మీడియా వర్గాలు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. హీరోయిన్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకునే సినిమా కథ రాస్తారా? అన్న ప్రశ్నకు.. రొమాంటిక్ సినిమా తీస్తే మాత్రం ఆ విధంగా చేస్తాననిఅన్న వర్మ "నాకు ఇంకో ఊర్మిళ దొరికినప్పుడు 'రంగీలా' లాంటి సినిమా మళ్లీ చేస్తాను" స్పష్టం చేసారు.పెర్ఫామెన్స్, గ్లామర్.. ఇలా ఏ ఏ అంశాలు చూసి మీ చిత్రాల్లో హీరోయిన్ కు అవకాశమిస్తారని వర్మను అడగగా. 'నా కళ్లకు నచ్చితే చాలు' అన్నారు. అందాల తార శ్రీదేవితో మళ్లీ ఇంకో సినిమా తీసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిష్యత్ లో ఉంటుందేమో చెప్పలేనని తన అనుభూతులను పంచుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







