ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త లుక్ ఆవిష్కరణ
- October 19, 2023
న్యూఢిల్లీ: రీబ్రాండింగ్‌లో భాగంగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం తన కొత్త లుక్‌ను ప్రజల ముందుంచింది. మునుపటి డిజైన్‌కు భిన్నంగా కొత్త చిహ్నాలతో (లివరీ) మెరిసిపోతున్న బోయింగ్-737 విమానం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ ఆవిష్కరించారు. ఇది కేవలం కొత్త బ్రాండ్ డిజైన్ కాదని, తాము ఎవరో, తమ విజన్ ఏంటో ఈ మార్పులతో చెప్పదలుచుకున్నామని సంస్థ సీఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ఇకపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త తరానికి చెందిన ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తుందన్నారు.
రాబోయే 15 నెలల్లో కొత్త డిజైన్, చిహ్నాలు ఉన్న 50 బోయింగ్ 737 విమానాలను సంస్థ అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడేళ్లల్లో 170 నారో బాడీ విమానాలు కలిగిన సంస్థగా ఎదగాలని ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటీవలే ఎయిర్ ఇండియా కొత్త లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







