యూఏఈలో రోడ్డు ప్రమాదం..ఎమిరాటీ మృతి
- October 20, 2023
యూఏఈ: పికప్ ట్రక్ ట్రాఫిక్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక ఎమిరాటి మరణించాడు. ఇందులో మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎమిరేట్‌లోని షామల్ ప్రాంతంలోని ఒక కూడలికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మహ్మద్ అల్ బహర్ ప్రకారం.. వీరిద్దరి కారు కూడలికి సమీపంలో దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద నివేదిక అందిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను రంగంలోకి దిగింది. డ్రైవర్‌తో పాటు అతని సహచరుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమిరాటీ మరణించాడు. డ్రైవర్ గాయపడ్డాడని, అయితే పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







