గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం విజయవంతం
- October 21, 2023
శ్రీహరికోట: గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం సక్సెస్ అయింది. సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించింది. ఈ ఉదయం సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచిపోయింది. చివరిక్షణంలో ప్రయోగం నిలిచిపోయింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాంకేతిక లోపం గుర్తించి సరి చేశారు. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు తిరిగి ప్రయోగాన్ని చేపట్టారు. శనివారం ఉదయం 10గంటలకు గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీడీ-1 ప్రయోగించారు.
2025లో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే యోచన చేస్తున్నారు. క్రూ ఎస్కేస్ వ్యవస్థను ఇస్రో పరీక్షిస్తోంది. మానవ సహిత ప్రయోగానికి ముందు క్రూ ఎస్కేప్ పరీక్ష నిర్వహించనున్నారు. గగన్ యాన్ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చే ఘట్టంలో ఏదైనా అవాంతరం చోటు చేసుకుంటే క్షేమంగా వారు తప్పించుకోవడానికి ఈ క్రూ ఎస్కేప్ సిస్టo ఉపయోగపడనుంది.
ఇస్రో మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్ యాన్ టెస్ట్ వెహికల్ టీవీ-డీ1ప్రయోగానికి నిన్న సాయంత్రం 7.30 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగించాలని భావించారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించాలని అనుకున్నారు.
కానీ, సాంకేతిక కారణాల వల్ల 30 నిమిషాలు ఆలస్యంగా 8.30 గంటలకు గగన్ యాన్ ను ప్రయోగించాలని భావించారు. గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం సమయంలో స్వల్ప మార్పు చేశారు. సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగించాలనుకున్నారు. అయితే, మరోసారి గగన్ యాన్ టెస్ట్ లాంచ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చివరి క్షణంలో కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు.
శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. కౌంట్ డౌన్ కు నాలుగు సెకండ్ల ముందు ప్రయోగం నిలిపివేశారు. సాంకేతిక సమస్యను పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు సరి చేసి తిరిగి గగన్ యాన్ మిషన్ ను ప్రయోగించారు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. గగన్ యాన్ మిషన్ టీవీడీ -1 ప్రయోగం విజయవంతం అయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలోపాటు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







