ఓటమి

- October 21, 2023 , by Maagulf
ఓటమి

నీడలా వెన్నంటే వుంటుంది 
కెరటంలా పడతు లేస్తుంటుంది 
నిస్సత్తువని చవి చూపిస్తుంది
ఆలోచనలని దహించేస్తూ....

కసితో తపనని ప్రేరేపిస్తుంది 
వ్యూహాలకి మార్గం సుగమం చేస్తుంది 
భయపెడ్తూనే ఎదురీదమంటుంది 
ఓపికను అనుక్షణం పరీక్షిస్తుంది...

ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది 
బతుకు విలువేంటో తెలుపుతుంది 
గతకాలపు పీడకలలా వెంబడిస్తుంది
భవిష్యత్తుకై ఆలోచనలు పెంచేస్తుంది 
నమ్మకం సడలిపోయేలా చేస్తుంది 
ఎన్నో విపత్తులకు దారులు వేస్తూ....

గుండెలో బాధల సుడిగుండాలు రేపుతూ  
నీ తలరాత ఇంతేనని వెక్కిరిస్తూ 
పద్మవ్యూహాన్ని ఛేదించమంటూ 
మనోధైర్యం లేదని అడుగులనే కదలనీయక 
శాశ్వతమో అశాశ్వతమో అన్న 
విషయమేమి తెలుపక
మనతో ఆటలాడుకుంటుంది 
ఏమి చిత్రమో ఈ "ఓటమి."

--యామిని కోళ్ళూరు(అబుధాభి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com