1967 సరిహద్దులతో పాలస్తీనా రాష్ట్రం కోసం పిలుపునిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- October 21, 2023
రియాద్: 1967 సరిహద్దులతో పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మధ్యప్రాచ్య సంఘర్షణకు న్యాయమైన పరిష్కారాన్ని నిర్ధారించే విధంగా గాజాలో స్థిరత్వం, శాశ్వత శాంతికి దారితీసే పరిస్థితులను సృష్టించాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పిలుపునిచ్చారు. ఏ నెపంతోనైనా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ మానవతా చట్టానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. పౌరుల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే వారి మౌలిక సదుపాయాలపై సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. శుక్రవారం రియాద్‌లో జరిగిన జిసిసి-ఆసియాన్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గల్ఫ్ సహకార మండలి (జిసిసి) మరియు ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) రియాద్ సమ్మిట్‌కు ప్రిన్స్ మొహమ్మద్ అధ్యక్షత వహించారు. "GCC-ASEAN దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ఒక మైలురాయిని సాధించాయి. మన దేశాల సామూహిక GDP $7.8 ట్రిలియన్లకు మించిపోయింది. ప్రపంచ GDPకి మా దేశాల సహకారాన్ని పెంచిన ఆర్థిక వృద్ధిని మేము చూశాము. GCC ఆర్థిక వ్యవస్థలు,ASEAN దేశాలు 2022లో వరుసగా 7.3% మరియు 5.7% వృద్ధి చెందాయి. మరింత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ కోసం కలిసి పనిచేయాలి." అని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







