ఫ్యూచర్ స్టార్స్ కోసం..న్యూ జెన్ ఫిల్మ్ అవార్డ్స్-2023
- October 22, 2023
- ఎఫ్టీపీసీ ఇండియా, తెలుగు సినిమా వేదిక, సౌత్ సినిమా ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో వినూత్న కార్యక్రమం
- తమ ప్రతిభను ప్రదర్శించేందుకు భవిష్యత్ తారలకు అద్భుత అవకాశం
- దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు నూతన నటీమణుల పరిచయ వేదిక
- డిసెంబరు 16న ఫిల్మ్ నగర్ లో న్యూ జెన్ అవార్డ్స్ వేడుక
హైదరాబాద్: ప్రతిభావంతులైన యువ నటీమణులను దక్షిణాది చిత్రసీమకు పరిచయం చేసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపుదిద్దుకుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో రాణించాలని కలలుగంటున్న నవతరం నటిమణులను 'ఫ్యూచర్ స్టార్స్'గా తీర్చిదిద్దేందుకు పలు ప్రతిష్టాత్మక సంస్థలు చేతులు కలిపాయి. యువ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి, దక్షిణాది సినిమా రంగంలో వారిని తారలుగా వెలుగొందేలా చేసేందుకు 'న్యూ జెన్ అవార్డ్స్-2023' వేడుకకు రంగం సిద్ధమైంది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎఫ్టీపీసీ) ఆఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక, సౌత్ సినిమా ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో భాగంగా యువ నటీమణుల ప్రతిభను వెలికితీసేందుకు మెగా టాలెంట్ షో జరుగుతుంది.
Chaitanya Janga (President FTPC INDIA)
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజ సినీ దర్శకుల పర్యవేక్షణలో ఈ టాలెంట్ షో నిర్వహించబడుతుంది. భారత దేశ సినీ చరిత్రలో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ న్యూ జెన్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేందుకు ఎఫ్టీపీసీ ఇండియా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 16న ఫిలింనగర్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, వర్మ పాకలపాటి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నటీమణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి ప్రతిభను దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తామని చెప్పారు. తాము నిర్వహించే న్యూ జెన్ ఫిల్మ్ అవార్డ్స్ అనేక మంది భవిష్యత్ తారలను సౌత్ సినీ ఇండస్ట్రీకి అందిస్తుందని వారు పేర్కొన్నారు.

PVS Varma(Sectretary FTPC INDIA)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







