AMR గ్రూప్ సంస్థలపై ముగిసిన ఐటీ సోదాలు
- October 22, 2023
AMR కన్ స్ట్రక్షన్స్ కంపెనీలపై ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.15కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. బెంగళూరు కేంద్రంగా వివిధ పార్టీలకు ఏఎంఆర్ కంపెనీ డబ్బులు పంపిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అటు పోలీసులు ఇటు ఎన్నికల సంఘం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.15 కోట్ల నగదు సీజ్ చేశారు. ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఏఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి బదిలీ అయినట్లుగా పోలీసులు, ఈసీ అధికారులు, ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి ఏఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీలతో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు.
బెంగళూరు నుంచి తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు ఈ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇవ్వడానికి డబ్బు తరలిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్, బెంగళూరుతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో ఈసీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన పత్రాలతో పాటు నగదు కూడా సీజ్ చేశారు.
బెంగళూరులో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతల నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు తెలుస్తోంది. నిజంగానే వారి ప్రమేయం ఉందా? లేదా? అన్నది తేల్చేందుకు అధికారులు ఆధారాలు గుర్తించే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







