తేజ్ తుఫాను..నివాసితులకు అలెర్ట్ జారీ
- October 23, 2023
యూఏఈ: జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసినట్లుగా ఆదివారం మధ్యాహ్నం యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను అధికారులు జారీ చేశారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను కేటగిరీ 2 తుఫాను మారిందని, వచ్చే 24 గంటల్లో ఇది కేటగిరీ 3 వన్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్వత ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షంలో కార్లు నడుపుతున్న వీడియోలను అధికార యంత్రాంగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వాతావరణ పరిస్థితులలో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని NCM హెచ్చరిక జారీ చేసింది.
అత్యవసరమైతే తప్ప వాహనాలను బయటకు తీయొద్దని, డ్రైవ్ చేయాల్సి చేస్తే.. రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. విజిబిలిటీ తగ్గినప్పుడు తక్కువ-బీమ్ లైట్లను ఆన్ చేయాలి. అధికారిక ఛానెల్‌ల నుండి వచ్చే వాతావరణ సూచనలను అనుసరించాలి. నివాసితులు పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరింది. సోమవారం మధ్యాహ్నం కూడా యూఏఈలో వర్షం కురిసే అవకాశం ఉందని, పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని ఎన్‌సిఎం తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







