తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 23, 2023
అబుధాబి: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుధాబిలో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.అబుధాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ అద్భుత కార్యక్రమానికి అబుధాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యింది యూఏఈలో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు.ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో తెలంగాణ నుండి వందలాది కిలోల వివిధ పూల ను తెప్పించి అబుధాబిని పూల వనంగా మార్చారు.
కార్యక్రమం రోజు (October 22, 2023 ఆదివారం) ఉదయం ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు.ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాటలతో మార్మోగించారు.ఆదివారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి వందలాది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు.
ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు మరియు నృత్య దర్శకుడు కోకిల నాగరాజు మరియు తెలంగాణ వర్ధమాన గాయని కుమారి సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణ సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు. ఆ తరువాత వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. తెలంగాణ నుండి వచ్చిన ఇద్దరు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారందరిని విశేషంగా ఆకర్షించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిధిగా మరియు కాన్సులర్ డా.ఆర్.బాలాజీ మరియు కుటుంబ సభ్యులు గౌరవ అతిధులుగా హాజరయ్యారు.వారు కూడా తెలంగాణ మహిళాలతో బతుకమ్మ ఆడి పాడారు.తదనంతరం కార్య నిర్వాహకులు 9 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమ ముఖ్య దాతలు ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్, రిషీ ఇన్ఫ్రా, ఎస్పాకో, గ్రేటస్, మలబార్ గోల్డ్,స్క్వేర్ యార్డ్స్, ఆసమ్ సలోన్, లీజర్ ఈవెంట్స్ అజంతా జెవెలర్స్ మరియు సురాని గ్రూప్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు ఈ కార్యక్రమాన్ని గోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు,సందీప్,అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, పద్మజ, లక్ష్మి, సుధ తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు తెలియజేశారు.



తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









