తేజ్ తుఫాను కోసం ఒమన్ సర్వసన్నద్ధం
- October 23, 2023
మస్కట్: తేజ్ తుఫాను ధోఫర్, అల్ వుస్తా గవర్నరేట్లలో తీవ్ర ప్రభావం చూపనుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. తుఫాను (తేజ్) ధోఫర్, అల్ వుస్తా గవర్నరేట్లలోని అనేక విలాయత్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. CAA జారీ చేసిన హెచ్చరిక (2) ప్రకారం, నేషనల్ మల్టీ-హాజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్లోని వాతావరణ చార్ట్‌ల విశ్లేషణ తుఫాను వర్గం 3 (తేజ్) అక్షాంశం 12.9 °N మరియు రేఖాంశం 54.7 °Eపై కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుఫాను కేంద్రం ఒమన్ తీరానికి 450 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కేంద్రం చుట్టూ గాలి వేగం 100 నుండి 112 నాట్ల మధ్య ఉంటుందని అంచనా. తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా దోఫర్ గవర్నరేట్ మరియు రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ (ఏఐ మహరా) తీరాల దిశగా కొనసాగుతుందని వెల్లడించింది. ఇది మరో 24 గంటల్లో కేటగిరీ (4) తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో సముద్రం (4-7 మీటర్ల అలలతో చాలా అల్లకల్లోలంగా ఉంటుందని, తుఫాను కారణంగా లోతట్టు తీర ప్రాంతాలను సముద్రపు నీరు ముంచెత్తుతుందని హెచ్చరించారు. వాడీలు మరియు లోతట్టు ప్రాంతాలను దాటకుండా ఉండాలని సూచించింది. ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లవద్దని కూడా తెలిపింది. మరోవైపు తేజ్ తుఫానుకు సన్నాహకంగా సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రిని ఖాళీ చేయించారు అధికారులు. అలాగే ధోఫర్ గవర్నరేట్‌లోని సలాలా, రక్యుత్ మరియు ధాల్కుట్లోని విలాయత్‌లలోని హలానియాత్ దీవులు మరియు తీర ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయించారు. ధోఫర్ గవర్నరేట్‌లో అనేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తేజ్ తుఫాను కారణంగా అక్టోబర్ 23, అక్టోబర్ 24 తేదీలలో దోఫర్ గవర్నరేట్, అల్ వుస్తా గవర్నరేట్‌లోని అల్ జజీర్ విలాయత్‌లలో పనులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కోసం మెయిన్ మిలిటరీ కమిటీ చైర్మన్, ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బ్రిగేడియర్ హమీద్ అబ్దుల్లా అల్ బలూషి అధ్యక్షతన సమీక్షా సమావేశాలు జరిగాయి. సాయుధ దళాలు ఉష్ణమండల తుఫాను ప్రభావాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయని సుల్తాన్ పునరుద్ఘాటించాయి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







