సౌదీ అరేబియా, దక్షిణ కొరియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- October 23, 2023
రియాద్: సౌదీ అరేబియాలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పర్యటిస్తున్నారు. ఆదివారం రియాద్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ కు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అల్ యమామా ప్యాలెస్‌లో విస్తృత చర్చల్లో పాల్గొన్నారు. సౌదీ అరేబియా- కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పరస్పర ప్రయోజనం కోసం ఇరు దేశాల సమృద్ధిగా ఉన్న వనరులను ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించారు. వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాలపై ఇదు దేశాల నాయకులు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సౌదీ అరేబియా ఆటోమొబైల్ మరియు నౌకల తయారీలో జాయింట్ వెంచర్లతో సహా అత్యాధునిక పారిశ్రామిక భాగస్వామ్యాలకు ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని అధ్యక్షుడు యూన్ కోరారు. పర్యాటకం, సాంస్కృతిక మార్పిడిలో సహకరించుకోవాలని నిర్ణయించారు. అనంతరం క్రౌన్ ప్రిన్స్ మహ్మద్, ప్రెసిడెంట్ యూన్ రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తూ పలు కీలక ఒప్పందాలు మరియు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







