భారత్ నిర్ణయం పై స్పందించిన కెనడా
- October 26, 2023
ఒట్టావా: భారత్ తాజా నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. కెనడా వాసులకు వీసాల జారీ సేవలను పాక్షికంగా ప్రారంభిస్తున్నట్టు భారత్ తాజాగా ప్రకటించింది. భారత్ నిర్ణయంపై కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ స్పందిస్తూ.. ఆందోళనకర సమయంలో దీన్ని మంచి సంకేతంగా పేర్కొన్నారు. భారత నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. అసలు ఇలాంటిది ఎన్నడూ జరగకూడదన్నారు. కెనడా అత్యవసర సేవల మంత్రి హర్జీత్ సజ్జన్ సైతం భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. వీసా సేవలను తిరిగి ప్రారంభిస్తూ భారత్ చేసిన ప్రకటనపై ఊహాత్మక వ్యాఖ్యలు చేయబోనన్నారు.
వ్యాపార వీసాలు, వైద్యపరమైన వీసాలు, కాన్ఫరెన్స్ వీసాలు, ప్రవేశ వీసాల సేవలను భారత్ తిరిగి ప్రారంభించింది. భారత దౌత్య సిబ్బంది భద్రత, రక్షణ విషయంలో కెనడా అధికారులు తగిన విధంగా స్పందించడం వల్లే వీసా సేవలను తిరిగి ప్రారంభించినట్టు సమాచారం. దీనిపై గడిచిన 10 రోజులుగా పలు పర్యాయాలు చర్చలు జరిగినట్టు ఈ వ్యవహారం తెలిసిన ఓ అధికారి వెల్లడించారు. ఇక్కడి నుంచి అయినా రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి సమసిపోతుందేమో చూడాలి.
కాగా, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించగా, భారత్ సైతం అదే విధమైన చర్య తీసుకుంది. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి భారత్ లో అధిక సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత్ కెనడా దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకోక తప్పలేదు. దీన్ని దురదృష్టకర పరిణామంగా కెనడా పేర్కొంది. భారత్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపించింది. కెనడాలో భారత దౌత్య సిబ్బందికి సమానంగా, కెనడా దౌత్య సిబ్బంది ఉండాలన్నదే తమ విధానంగా భారత్ పేర్కొంది.
అనంతరం కెనడాలోని భారత దౌత్య సిబ్బందికి భద్రతకు హామీ లేనందున వీసా సేవలను నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. కెనడా సైతం భారత్ లోని అన్ని కాన్సులేట్లలో కార్యకలాపాలు, వీసాల జారీని నిలిపివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. చూస్తుంటే ఇది ఎంత వరకు వెళుతుందోనన్న సందేహం ఏర్పడింది. ఈ పరిస్థితి కుదుట పడే దిశగా భారత్ చొరవ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కెనడా వాసులకు వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కెనడాతో దౌత్య చర్చల అనంతరం ఈ పరిణామం జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







