షిర్డీ సాయికి పూజలు చేసిన ప్రధాని మోడీ..

- October 26, 2023 , by Maagulf
షిర్డీ సాయికి పూజలు చేసిన ప్రధాని మోడీ..

షిర్డీ: ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి  చేరుకున్నారు. సాయి బాబా ఆలయంలో ప్రధాని మోడీ పూర్తి ఆచార వ్యవహారాలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. షిరిడీ ఆలయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఆలయ సిబ్బంది, భక్తులు కలిసి ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com