జూన్ 6 నుంచి రమదాన్: బహ్రెయినీ ఆస్ట్రనామర్
- May 23, 2016
పవిత్ర రమదాన్ ఉపవాస మాసం జూన్ 6న ప్రారంభమై, జులై 5న ముగుస్తుందని బహ్రెయిన్‌కి చెందిన సీనియర్ ఆస్ట్రనామర్ చెప్పారు. బహ్రెయిన్ ఆస్ట్రనామికల్ సొసైటీ (బిఎఎస్) డిప్యూటీ ఛైర్మన్ వహీబ్ అల్ నాసర్ మాట్లాడుతూ, ఆదివారం జూన్ 5 నుంచి చంద్రుడిలో రమదాన్ మాసం సందర్భంగా మార్పులు చోటుచేసుకుంటాయనీ, ఆ మరుసటి రోజు నుంచి ఉపవాస మాసం ప్రారంభమవుతుందని వివరించారు. తొలి రోజు 15 గంటల 18 నిమిషాలపాటు ఉపవాసం చేయాల్సి ఉంటుందనీ, చివరి రోజు 15 గంటల ఏడు నిమిషాలపాటు ఉపవాసం చేయాలని చెప్పారాయన. బహ్రెయిన్‌లో గత ఏడాది ఉపవాస సమయం 15 గంటల 18 నిమిషాలు తొలి రోజు అనీ, చివరి రోజు 15 గంటల రెండు నిమిషాలు మాత్రమేనని వివరించారు. అయితే, రమదాన్ ప్రారంభం - ముగింపుపై ఎప్పటికప్పుడు వివాదాలు తెరపైకి వస్తుంటాయి. చంద్ర దర్శనాన్ని బట్టి ఉండే ఈ పవిత్ర దినానికి సంబంధించి, వాతావరణ మార్పులు కీలక ప్రభావం చూపిస్తాయి. ఆయా దేశాల్లో చంద్ర దర్శనం జరగడంలో ఆలస్యం ఒక్కోసారి రంజాన్ ముందుకి లేదా వెనక్కి జరగడం చూస్తున్నాం. రమదాన్ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు అల్లా సేవలో తరిస్తారు. ఈ సమయంలో భోజనం చేయడం, ఇతర ద్రవపదార్థలను సేవించడం, శారీరక సుఖాల్ని పొందడం వంటివాటికి దూరంగా ఉంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







