పాలస్తీనియన్లకు బహ్రెయిన్ రాజు మద్దతు.. ప్రతినిధుల మండలి ప్రశంసలు
- October 27, 2023
బహ్రెయిన్: పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులకు మద్దతుగా హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చేసిన అద్భుతమైన దౌత్య ప్రయత్నాలకు ప్రతినిధుల మండలి ప్రశంసించింది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బహ్రెయిన్ రాజ్యం చారిత్రక, దృఢమైన వైఖరిని ధృవీకరించిందని తన ప్రకటనలో వెల్లడించింది. న్యాయమైన, శాశ్వతమైన మరియు స్థిరమైన శాంతిని తీసుకురావడానికి HM రాజు అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకునే హక్కుకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని సూచించింది. కైరో సమ్మిట్ ఫర్ పీస్‌లో రాజు చేసిన ప్రసంగాన్ని ప్రతినిధుల మండలి ప్రశంసించింది. దీనిలో పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను పొందకుండా మధ్యప్రాచ్యంలో స్థిరత్వం ఉండదని HM చెప్పారు. పరిస్థితిని మరింత దిగజార్చకుండా సైనిక కార్యకలాపాలను ముగించాలని, అమాయక పౌరులకు రక్షణ కల్పించాలని, గాజా స్ట్రిప్‌లోకి మానవతా సహాయాన్ని అనుమతించాలని, ఖైదీలను విడుదల చేయాలని, అలాగే మానవతా మరియు అంతర్జాతీయ అంశాలకు కట్టుబడి ఉండాలన్న HM కింగ్ హమద్ పిలుపును కౌన్సిల్ ప్రశంసించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!