యూఏఈకి వెళుతున్నారా.. అప్టేడ్ నిషేధిత వస్తువుల జాబితా వెల్లడి
- October 27, 2023
యూఏఈ: ఇండియా-యుఏఈ ఎయిర్ కారిడార్ అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. పెద్ద సంఖ్యలో భారతీయులు వ్యాపారం, పర్యాటకం, ఉపాధి ప్రయోజనాల కోసం గల్ఫ్ దేశానికి వెళతారు. దీపావళి, న్యూ ఇయర్ వేడుకల సమయాల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ముంబై విమానాశ్రయం ప్రకారం.. చెక్-ఇన్ సామానులో తరచుగా కనిపించే కొన్ని నిషేధిత వస్తువులను ప్రకటించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) మూడవ త్రైమాసిక ప్రయాణీకుల గణాంకాల ప్రకారం.. దుబాయ్, లండన్, అబుదాబిలు అత్యంత ప్రాధాన్య అంతర్జాతీయ గమ్యస్థానాలుగా ఉన్నాయి. యూఏఈలో 3.5 మిలియన్లకు పైగా ప్రవాస భారతీయులు ఉంటారు. అలాగే పర్యాటకుల సంఖ్యలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాన్ని 6 మిలియన్ల మంది ప్రయాణికులతో 2023 ప్రథమార్థంలో భారతదేశం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అగ్ర గమ్యస్థానంగా నిలిచింది.
నిషేధించబడిన కొన్ని వస్తువుల జాబితా:
ఎండు కొబ్బరి (కొప్రా), బాణసంచా,పార్టీ పాపర్స్, మ్యాచ్ బాక్సులు, పెయింట్ డబ్బాలు, అగ్ని కర్పూరం, నెయ్యి, ఊరగాయలు(చట్నీలు), నూనె సంబంధిత ఆహార పదార్థాలు, ఇ-సిగరెట్లు, లైటర్లు, పవర్ బ్యాంకులు, స్ప్రే సీసాలు, గసగసాలు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!