వినాయక్‌కి ఛాన్స్ ఇవ్వబోతున్న మాస్ రాజా.!
- October 27, 2023
వి.వి.వినాయక్ అంటే.. ఒకప్పుడు తెలుగులో స్టార్ డైరెక్టర్. బోలెడన్ని పవర్ ఫుల్ మాస్ సినిమాలు వచ్చాయ్ ఆయన దర్శకత్వంలో. ‘అఖిల్’ సినిమా వినాయక్‌ని బాగా కుంగదీసిన టైమ్‌లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో పుంజుకున్నాడు వినాయక్.
అయినా మళ్లీ ఆయన కెరీర్ నత్త నడకలోనే సాగుతోంది. ఈ తరుణంలో మాస్ రాజా రవితేజ, వినాయక్‌కి ఓ ఛాన్స్ ఇచ్చినట్లు తాజా సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణ’ రవితేజకు మంచి హిట్ ఇచ్చింది.
సరికొత్త ప్రయోగాలతో.. కొత్త దర్శకులను టచ్ చేసుకుంటూ వెళుతున్న రవితేజ తాజాగా వినాయక్ చెప్పిన ఓ పవర్ ఫుల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లనుందట.
ఇటీవలే ‘టైగర్ నాగేశ్వరరావు’తో ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ, ప్రస్తుతం ‘ఈగల్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ లోపు వినాయక్ ప్రాజెక్ట్.. అన్నీ కలిసొచ్చి, ఈ ఛాన్స్ వర్కవుట్ అయితే వినాయక్ ఈజ్ బ్యాక్ అనొచ్చేమో. చూడాలి మరి ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!