ఈవెంట్ మేనేజర్‌తో పెళ్లికి రెడీ అవుతోన్న అమలా పాల్.!
- October 27, 2023
మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమవుతోందని సమాచారం. గత కొన్నాళ్లుగా ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌తో అమలా పాల్ సన్నిహితంగా వుంటోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ఇద్దరి ప్రేమ కథ బయటపడింది. సోషల్ మీడియా ద్వారా ఈ ప్రేమ జంట తమ ప్రేమ కథను రివీల్ చేస్తూ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు.
గతంలో తమిళ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్‌ని వివాహం చేసుకున్న అమలా పాల్.. అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఆమె తన కెరీర్‌లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది అమలా పాల్.
ఓ వైపు కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా బిల్డప్ చేసుకుంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితం పైనా దృష్టి పెట్టింది. ఆ క్రమంలోనే ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడిందట. త్వరలో జగత్‌ని రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావల్సి వుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!