షార్జాలో భారీ అగ్ని ప్రమాదం..కుటుంబాన్ని కాపాడిన పదేళ్ల బాలుడు
- October 28, 2023
యూఏఈ: బుధవారం షార్జాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుండి 10 ఏళ్ల ఎమిరాటీ బాలుడు తన కుటుంబాన్ని రక్షించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్ హైతం అహ్మద్ అల్ నఖ్బీ అనే యువకుడు అర్ధరాత్రి తర్వాత నిద్ర లేచాడు. తెల్లవారుజామున 2 గంటలకు షార్జాలోని కల్బా ప్రాంతంలోని వారి నివాసంలో ఏదో మండుతున్న వాసన చూసి తన తండ్రికి తెలియజేసాడు. పిల్లల ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి మంటలు రావాడాన్ని గుర్తించాడు. ఏసీలో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న తన మరో ఇద్దరు కుమారులు నహ్యాన్ (9 ఏళ్లు), మక్తూమ్ (8 ఏళ్లు)లను హైతం వేగంగా బయటకు తీసుకొచ్చాడు. మిగిలిన కుటుంబం వారి ఇంటి ప్రాంగణం వెలుపల సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు మిగిలిన ఇంటికి వ్యాపించకుండా సకాలంలో ఆర్పివేశాయి.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









