గాజాలో హింసాకాండ పెరగడంపై ఆందోళన
- October 28, 2023
మస్కట్: గాజాలో హింసాకాండ పెరగడంపై మస్కట్‌లో జరిగిన ముప్పై నాల్గవ సమావేశం సందర్భంగా అరబ్ మంత్రుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అనాగరిక దురాక్రమణకు పాల్పడుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది మంది మరణించారని, పదివేల మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. అదే సమయంలో వేల మంది ప్రజలు ఆశ్రయం లేకుండా నిరాశ్రయులయ్యారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గాజాలో జీవన విధ్వంసానికి ఇజ్రాయెల్ పాల్పడుతుందని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల విధ్వంసానికి పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనియన్ పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







