గాజాలో హింసాకాండ పెరగడంపై ఆందోళన

- October 28, 2023 , by Maagulf
గాజాలో హింసాకాండ పెరగడంపై ఆందోళన

మస్కట్: గాజాలో హింసాకాండ పెరగడంపై మస్కట్‌లో జరిగిన ముప్పై నాల్గవ సమావేశం సందర్భంగా అరబ్ మంత్రుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అనాగరిక దురాక్రమణకు పాల్పడుతుందని తెలిపింది.  ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది మంది మరణించారని, పదివేల మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. అదే సమయంలో వేల మంది ప్రజలు ఆశ్రయం లేకుండా నిరాశ్రయులయ్యారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గాజాలో జీవన విధ్వంసానికి ఇజ్రాయెల్ పాల్పడుతుందని,  మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల విధ్వంసానికి పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  పాలస్తీనియన్ పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com