ఆయన బయోపిక్ అయితే నటిస్తా - విక్టరీ వెంకటేష్.!

- October 30, 2023 , by Maagulf
ఆయన బయోపిక్ అయితే నటిస్తా - విక్టరీ వెంకటేష్.!

విక్టరీ వెంకటేష్‌కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సార్లు క్రికెట్ మ్యాచ్‌ల వద్ద యాక్టివ్‌గా ఆయన పార్టిసిపేట్ చేయడం చూశాం. తాజాగా వరల్డ్ కప్ జరుగుతున్ననేపథ్యంలో అహ్మదాబాద్‌లో దర్శనమిచ్చారాయన.

ఇండియా‌ టీమ్‌ని ఎంకరేజ్ చేస్తూ దగ్గరుండి విక్టరీ అందించినంత పని చేశారు. ఈ సందర్భంగా కామెంటేటర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన తన మనసులోని మాట బయట పెట్టారు.  ఒకవేళ ఏ క్రికెటర్ బయోపిక్‌లో అయినా నటించాల్సి వస్తే.. ఏ క్రికెటర్ బయోపిక్ చేస్తారు.? అని అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా క్రికెటర్ విశ్వనాధ్ పేరు చెప్పారు.

ఆయనంటే తనకు చాలా ఇష్టమనీ, ఆయన బయోపిక్ స్క్రిప్ట్ తన  వద్దకు వస్తే ఖచ్చితంగా నటిస్తా.. అని చెప్పారు. అలాగే కొన్ని షరతులు విధించారు. తాను నటించాలంటే.. ఆ బయోపిక్‌లో అంత శక్తివంతమైన డ్రామా వుండాలి.. అని చెప్పారు.

ఇంకేముంది.! హీరో రెడీ. ఎలాగూ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ వుంది కాబట్టి.. క్రికెటర్  విశ్వనాధ్ బయోపిక్ రెడీ చేస్తే వెంకటేష్ హీరోగా అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సిద్ధమైపోతుంది మరి. రచయితలూ, డైరెక్టర్లూ అందుకు సిద్ధమేనా.?

ఇకపోతే, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com