ప్రగతీ ఆంటీనా.! మజాకానా.! మీడియాకి చురకలంటించేసిందిగా.!
- October 30, 2023
తాను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటూ వచ్చిన పుకార్లను ఖండిస్తూ సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ప్రగతి, ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయిన సంగతి తెలిసిందే.
డాన్సింగ్ వీడియోలూ, వర్కవుట్ వీడియోలతో కుర్రకారులో పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకుంది ప్రగతి ఆంటీగా. అయితే, ఓ నిర్మాతను ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందట.. అంటూ ఓ రూమర్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేసింది.
ప్రగతి ఆంటీకి సంబంధించిన ఏ విషయమైనా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. అలాగే ఈ వార్త కూడా వైరల్ అయిపోయింది. కానీ, తూచ్.! ఇదంతా వుత్తదే.! ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి దూరే హక్కు మీ మీడియా ఛానెళ్లకు ఎవరిచ్చారు.? జర్నలిజం అంటే కొన్ని ఎథిక్స్ వుంటాయ్.. ఇంత ఛీప్‌గా బిహేవ్ చేయొద్దు.. అలాంటిదేమైనా వుంటే నేనే ముందు చెబుతా.. కదా.! అంటూ సదరు మీడియా ఛానెల్‌పై గుస్సా అయ్యింది ప్రగతి ఆంటీ.!
తగిన ఆధారాల్లేకుండా ఇలాంటి గాలి వార్తలు ప్రచారం చేయొద్దు.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది ప్రగతి. తద్వారా సదరు మీడియా ఛానెల్‌కి తనదైన స్టైల్‌లో గట్టిగానే చురకలంటించింది ప్రగతి.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







