హమ్మయ్యా.! ‘బిగ్’ హౌస్ నుంచి ‘ఒక్క మగాడు’ ఎలిమినేట్.!
- October 30, 2023
ఈ సారి బిగ్‌బాస్ సీజన్ మొదట నుంచీ కాస్త పసగానే సాగింది. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ఉల్టా ఫుల్టా.. అనే కాన్సెప్ట్‌తో స్టార్టింగ్ నుంచీ ఏదో తిక మక, మక తిక నడిపిస్తూ.. షోపై అంచనాలు నమోదు చేశారు.
మధ్యలో కాస్త డ్రాప్ అయినట్లుగా కనిపించినా.. మళ్లీ ఎలాగోలా పుంజుకుంది బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్. ఇక, లేటెస్ట్ ఎలిమినేషన్లలో భాగంగా కొరియోగ్రఫర్ సందీప్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చాడు.
శోభా శెట్టి, సందీప్ ఎలిమినేషన్ రౌండ్‌లో వుండగా.. శోభా శెట్టినే హౌస్ నుంచి పంపించేస్తారు ఈ సీజన్ బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్యాటర్న్‌లో భాగంగా అనుకున్నారంతా. కానీ, ప్యాటర్న్ ఛేంజ్ అయ్యింది. శోభా శెట్టిని వుంచేసి.. సందీప్‌ని ఎలిమినేట్ చేశారు.
ఫస్ట్ టైమ్ హౌస్ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయిన సందీప్ మాస్టర్, ఫస్ట్ టైమ్ నామినేషన్లలోకి వచ్చాడు ఈ వారం. ఫస్ట్ నామినేషన్‌కే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోవడం కాస్త ఆశ్చర్యంగా వున్నప్పటికీ.. ఇది బిగ్‌బాస్ షో.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు.. అన్నట్లుగా ఇదిగో ఇది జరిగింది.
సందీప్ మాస్టర్ నిజానికి టాప్ 5లో వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ, బయటి నుంచి వున్న కమిట్మెంట్స్‌లో భాగంగానే ఆయనను ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఏది ఏమైతేనేం, మొత్తానికి హౌస్‌లో తిష్ట వేసుకుని కూర్చున్న మేల్ కంటెస్టెంట్స్ నుంచి ఎట్టకేలకు ‘ఒక్క మగాడు’ ఎలిమినేట్ అయ్యాడంతే.!
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







