డెంగీ వైరస్‌ని లైట్ తీసుకోవద్దు.!
- October 30, 2023
సీజనల్ వైరల్ ఫీవర్స్‌తో పాటూ, డెంగీ జ్వరాలు కూడా మరో వైపు విజృంభిస్తున్న తరుణంలో కాస్త అప్రమంత్తంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణ డెంగీ ఫీవర్ రెండు మూడు రోజులు.. లేదంటే ఓ వారం రోజుల్లో తగ్గిపోతుంది. ప్లేట్‌లెట్స్ డౌన్ అవ్వడం అనేది డెంగీ ఫీవర్‌లో ముఖ్యంగా గమనించాల్సిన అంశం. తగినన్ని ఫ్లూయిడ్స్, సరైన పోషకాహారం ద్వారా ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకునే అవకాశం వుంటుంది.
నీరసంతో కూడిన జ్వరం ఎక్కువ రోజులున్నట్లయితే వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ, తాజా అధ్యయనాల్లో డెంగీ వైరస్‌లో సరికొత్త మార్పు చోటు చేసుకుంది. డెంగీ సోకిన 1000 మంది రోగులలో ఒకరికి ఈ వైరస్ మెదడు వరకూ చేరి మెదడుపై అత్యంత దారుణమైన ప్రభావం చూపుతున్నట్లుగా తేలింది.
దీన్ని డెంగీ ఎన్‌సెఫలైటిస్ వ్యాధిగా గుర్తించారు వైద్యులు. ఈ వ్యాధి సోకితే దాదాపు మృత్యు వాత పడడమే అంటున్నారు. వెయ్యి మందిలో ఒక్కిరికి మాత్రమే సోకే ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ మెదడు వరకూ విస్తరించి మెదడు పని తీరును పూర్తిగా దెబ్బ తీస్తుంది. తద్వారా రోగి బతికే అవకాశాలు చాలా తక్కువ. చాలా అరుదుగా మాత్రమే డెంగీ వైరస్ మెదడు వరకూ విస్తరిస్తుందనీ నిపుణులు చెబుతున్నారు.
శారీరక పరిశుభ్రతతో పాటూ, ఇంటి చుట్టు పక్కల, పని చేసే పరిసరాల పరిశుభ్రతను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెంగీ సోకిన తర్వాత, వ్యాధి వచ్చిన తగ్గిపోయిన కొన్ని రోజులపాటూ కూడా చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి